యూనిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్‌లో అగ్నిప్రమాదం

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): యూనిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్‌లో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్రోన్ వ్యతిరేక పరీక్షలకు సంబంధించిన పరికరాలను సిద్ధం చేస్తున్న ఈ సంస్థలో సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అగ్నిప్రమాదానికి గల క‌చ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం కారణంగా జరిగిన ఆస్తి నష్టంపై కూడా అధికారులు అంచనా వేయాల్సి ఉంది.

కాగా, ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తు పనుల నేపథ్యంలో అదే రోజు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ క్రమంలో విద్యుత్ అంతరాయం కారణంగా పరికరాలకు సంబంధించిన కూలింగ్ వ్యవస్థపై ప్రభావం పడి ఉంటుంద‌ని, దీంతో బ్యాటరీలు అధికంగా వేడెక్కి మంటలు చెలరేగి ఉంటాయ‌ని అనుమానిస్తున్నారు. అయితే, ఇది ప్రాథమిక అనుమానం మాత్రమేనని, పూర్తి స్థాయి తనిఖీలు, దర్యాప్తు అనంతరమే అగ్నిప్రమాదానికి అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here