శేరిలింగంపల్లిలో ఘనంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కార్యాలయం వద్ద శ్రీ దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి బీజేపీ ఇన్‌చార్జి ఎం. రవికుమార్ హాజరయ్యారు. వీరితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, శేరిలింగంపల్లి ప్రాంత ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతతోపాటు సేవాభావాన్ని చాటిచెప్పింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here