ఎస్.ఆర్. ఎస్టేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఎస్.ఆర్. ఎస్టేట్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 100 నుంచి 150 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలు, ఆటలతో పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా అందంగా బతుకమ్మలను పేర్చిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఆడపడుచుకు అట్టేపల్లి రామప్రభు బతుకమ్మ కానుకలను అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్. ఎస్టేట్ కాలనీ పెద్దలు, కాలనీవాసులు, ఏఆర్‌పీ టీమ్ సభ్యులు, యువత పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐకమత్యానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ కలిసికట్టుగా జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here