నిరుపేద మహిళ వైద్య చికిత్సకు రూ.లక్ష సాయం

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన మెరీనాకు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.1 ల‌క్ష ఆర్థిక సహాయానికి సంబంధించిన LOC మంజూరు పత్రాన్ని PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. మెరీనా అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి గాంధీ మంజూరు పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప వరమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా నిలుస్తున్నారని అన్నారు.

అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఈ నిధి అండగా నిలుస్తూ, అత్యవసర వైద్య చికిత్సకు సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాశీనాథ్ యాదవ్, తిరుపతి, సరిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here