బతుకమ్మ పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలో 40 మంది మహిళలకు చీరల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మను పురస్కరించుకుని ఆయువ్ స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి. రోహిత్ ముదిరాజ్ నేతృత్వంలో మియాపూర్‌లోని వివేకానంద వృద్ధాశ్రమంలో 40 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలిచి సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌వైఎఫ్ సభ్యులు స్వరూప్, కలీమ్, వసంత్, నాగరాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here