శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఎన్నికల సందర్భంగా హెచ్‌సీయూ డిపోలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్, యూనియన్ గౌరవ అధ్యక్షుడు రాగం నాగేందర్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి, యూనియన్ నాయకులు, ఆర్టీసీ కార్మికులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, కార్మికుల ఐక్యతే యూనియన్‌కు ప్రధాన బలమని రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు.

అనంతరం డిపోలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్మికులు, సిబ్బందికి స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో డిపో ప్రెసిడెంట్ టి. మనోహర్, డిపో సెక్రటరీ వై.ఎస్. బసప్ప, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, చీఫ్ అడ్వైజర్లు మహేష్ గౌడ్, ప్రసాద్, ట్రెజరర్ రవి కుమార్, కమిటీ సభ్యులు రవి, మల్లేశం, ఎం. శ్రీశైలం, నర్సింహులు, శ్రీశైలం, అనిల్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.






