శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్టీసీ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మియాపూర్–1, మియాపూర్–2, హెచ్సీయూ డిపోల వద్ద ప్రచారం నిర్వహించారు. ఆయా డిపోల్లోని ఆర్టీసీ కార్మికులను కలిసి యూనియన్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేయాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని నాయకులు గుర్తుచేశారు. యూనియన్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆరు నెలల్లోగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించేందుకు కృషి చేస్తామని మల్లన్న హామీ ఇచ్చినట్లు కార్మికులకు వివరించారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం టీఆర్పీ తరఫున పోరాటం చేస్తామని నాయకులు తెలిపారు. ప్రచార కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, శేరిలింగంపల్లి జనరల్ సెక్రటరీ జి. కురుమూర్తి ముదిరాజ్, శేరిలింగంపల్లి మైనార్టీ అధ్యక్షుడు ఖాన్ సాబ్, మియాపూర్–1 డిపో ఉద్యోగి శ్రీనివాస్ గౌడ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.






