శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): తనపై నమ్మకంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్మిక విభాగం సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్‌గా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర బీజేపీ కార్మిక విభాగం అధ్యక్షుడు ఆందె శ్రీనివాస్‌కు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుకు రాగిరి సాయిరాం గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని సాయిరాం గౌడ్ పేర్కొన్నారు.






