శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): గౌతమీనగర్ కాలనీలోని వి.ఆర్. రెసిడెన్సీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని వి.ఆర్. రెసిడెన్సీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కోరారు. రెసిడెన్సీ అవసరాలకు అనుగుణంగా తగిన సామర్థ్యం కలిగిన పైపులైన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులను ఆదేశించి చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రెడ్డి రఘునాథ్ రెడ్డి, జనార్దన్ రెడ్డితో పాటు అసోసియేషన్ సభ్యులు ఎస్. రమేష్, కె. సురేష్ కుమార్, ఎం. మల్లికార్జున్ రావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.






