శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్కు బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవులతోపాటు అన్ని బీసీ కులాలు ఐక్యంగా ముందుకు సాగి బీసీలకు రాజ్యాధికారం దక్కేలా కృషి చేయాలని, ఇందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సహాయ సహకారాలు అందించాలని కోరారు.

దీనిపై తలసాని శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ.. బహుజనులు, ఓబీసీలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని, ఎలాంటి కష్టం వచ్చినా వారి పక్షాన ఉంటానని హామీ ఇచ్చినట్లు బేరి రామచందర్ యాదవ్ తెలిపారు. అన్ని బీసీ కుల సంఘాల తరఫున తలసాని శ్రీనివాస్ యాదవ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు బేరి రామచందర్ యాదవ్ పేర్కొన్నారు.





