హెచ్‌సీఏ అండర్-16 సూపర్ లీగ్‌కు పీజేఆర్ క్రికెట్ అకాడమీ విద్యార్థి ఎంపిక

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పీజేఆర్ క్రికెట్ అకాడమీ విద్యార్థి బులా హితేష్ శేష సాయి హెచ్‌సీఏ అండర్-16 సూపర్ లీగ్ టీమ్-సీ కి ఎంపికయ్యాడు. ప్రాబబుల్స్ జట్టులో చోటు దక్కించుకున్న హితేష్‌కు పీజేఆర్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ రవి అభినందనలు తెలిపారు. తదుపరి రౌండ్ మ్యాచ్‌ల్లోనూ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ ఎంపిక పీజేఆర్ క్రికెట్ అకాడమీకి, హితేష్ కుటుంబ సభ్యులకు, శిక్షణ ఇచ్చిన కోచ్‌లకు ఆనందాన్ని కలిగించింద‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here