శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): ఓల్డ్ హఫీజ్పేట్లో శ్రీ వినాయక నవరాత్రుల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక మండపంలో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు, నిత్య హోమాలు, అన్నప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వినాయక నిమజ్జన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వినాయక లడ్డూ వేలం పాటలో ఓల్డ్ హఫీజ్పేట్కు చెందిన పి. మల్లేష్ యాదవ్ (సాత్విక డిజిటల్స్) పాల్గొని రూ.4,60,000లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అందుకున్న మహాగణపతి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, నిమ్మల శేఖర్ గౌడ్, నిమ్మల ఆనంద్ గౌడ్, నిమ్మల అనంతరామ్ గౌడ్ తదితరులతో పాటు హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు, ఓల్డ్ హఫీజ్పేట్ ప్రజలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






