శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ శేరిలింగంపల్లికి చెందిన పోరెడ్డి బుచ్చిరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రముఖులు, వర్తక సంఘాల ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేందుకు పూర్తిస్థాయిలో సహకరించిన పోలీసు అధికారులు, CMC అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.

అదేవిధంగా స్వామివారి లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించగా పద్మావతి జ్యువెలర్స్ రూ.3,75,000లకు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న పద్మావతి జ్యువెలర్స్ కి శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులతో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని బుచ్చిరెడ్డి ఆకాంక్షించారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.






