శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలోని 48వ మియాపూర్ సర్కిల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 5 ఫిర్యాదులు అందాయి. విభాగాల వారీగా చూస్తే టౌన్ ప్లానింగ్ విభాగానికి 2, ఇంజినీరింగ్ విభాగానికి 2, వెటర్నరీ విభాగానికి 1 ఫిర్యాదు అందింది. రెవెన్యూ, హెల్త్ అండ్ శానిటేషన్, యూసీడీ, యూబీడీ, ఎలక్ట్రికల్, ఇరిగేషన్ తదితర విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు సంబంధిత ఫిర్యాదులను నమోదు చేసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు.






