శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జీతేజ్ వి. పాటిల్ సూచించారు. మంగళవారం కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద నిర్వహించిన ప్రజా బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎండీ.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలకు అవకాశం లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ సిటీ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. చంద్రశేఖర్, కొండాపూర్ డివిజనల్ ఇంజనీర్ శ్యామ్ కుమార్, కేపీహెచ్‌బీ అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ మాణిక్యాలు, బాలాజీనగర్ అసిస్టెంట్ ఇంజనీర్ భీమ్ లింగప్ప, ఫోర్‌మెన్ కె. వెంకటేశ్వర్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు రవి నాయక్, నరసింహ, విజయ్ కుమార్, ఏఎల్‌ఎంలు యాదయ్య, సంతోష్, రాజశేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్టిజన్ కార్మికులు వెంకటేశ్ గౌడ్, పీతాంబర్, శ్రీను, రాజు నాయక్, నాగరాజు, కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.





