గౌతమీనగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు.. పూజల్లో పాల్గొన్న కసిరెడ్డి భాస్కరరెడ్డి

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గౌతమీనగర్ కాలనీ మున్సిపల్ పార్కులో 23వ సంవత్సరం వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం కాలనీవాసులతో కలిసి కాలనీ లీగల్, చీఫ్ అడ్వైజర్, బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, కాలనీ ప్రజలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here