శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి):రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని మాదాపూర్ పోలీసులు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు. ఈ మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవ కమిటీ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో మాదాపూర్ డివిజన్ ఏసీపీ శ్రీధర్, మాదాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






