మియాపూర్ సర్కిల్‌లో చెరువుల పరిశీలన.. కఠిన చర్యలకు అధికారుల సన్నద్ధం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ సర్కిల్-48 పరిధిలోని పలు చెరువులను సర్కిల్ ఉప కమిషనర్ జి శ్రీనివాస్, చందానగర్ సీఐ శ్రీధర్, ఇత‌ర‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోతకుంట చెరువు, గురునాథం చెరువు, రేగులకుంట వద్ద తవ్విన బేబీ పాండ్ ప్రాంతాలను అధికారులు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ పరిశీలనలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, హైడ్రా, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెరువుల పరిధిలోని పరిస్థితులు, సంబంధిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు పరిశీలన నిర్వహించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here