మియాపూర్ సర్కిల్-48లో పారిశుధ్య తనిఖీలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ సర్కిల్-48, SLPZ పరిధిలో పారిశుధ్య పరిస్థితులు, పౌర సౌకర్యాలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజయ్ సిటీతో పాటు మక్తా మహబూబ్‌పేట్ డివిజన్‌లోని బీకే ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక RWA ప్రతినిధులతో అధికారులు మాట్లాడి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం DC-48, EE, SSలతో కలిసి ట్రీ పార్క్‌ను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ, పౌర సౌకర్యాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. స్థానికంగా గుర్తించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత సిబ్బందికి ఉప కమిషనర్ జి. శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు, అవసరమైన పౌర సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here