గౌలిదొడ్డిలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు.. స్థానికుల హర్షం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి కేశవ్ నగర్‌లో విద్యుత్ స్తంభాలు లేక స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను బీఆర్ఎస్ పార్టీ నాయకులు నల్లగండ్ల డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాగం హరి శంకర్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను తెలుసుకున్న రాగం హరి శంకర్ యాదవ్ వెంటనే స్పందించారు. ఈ మేరకు జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసి, కేశవ్ నగర్‌లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యను పరిష్కరించాలని కోరారు.

దీనిపై స్పందించిన జోనల్ కమిషనర్ సంబంధిత అధికారులతో మాట్లాడి, అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కేశవ్ నగర్‌లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పూర్తయింది. సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ రాగం హరి శంకర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్, గద్దర్ రాజ్, భీంరాజ్, బ‌ద్రి, సాయిరాం, రవికుమార్, అరుణ్, అంజి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here