శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): FCI, TN నగర్, వైడా కాలనీ ప్రాంతాల్లో అట్టేపల్లి రామప్రభు పర్యటించి స్థానిక రోడ్ల దుస్థితిని స్వయంగా పరిశీలించారు. రోడ్లు అధ్వానంగా ఉండటంతో కాలనీ ప్రజలు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్‌లు సైతం రోడ్లపై వెళ్లలేని పరిస్థితి ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజల సమస్యలను పరిశీలించిన రామప్రభు కేవలం హామీ ఇచ్చి వెళ్లకుండా వెంటనే చర్యలు చేపట్టారు. మట్టి తెప్పించి రోడ్లపై వేయించడంతో పాటు వాటిని చదును చేయించే పనులను ప్రారంభించారు. దీంతో స్థానికులకు కొంత మేరకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఏర్పడింది. ప్రజల సమస్యలపై స్పందించడమే కాకుండా, అవసరమైన చోట స్వయంగా చొరవ తీసుకుని పరిష్కారానికి కృషి చేయడమే తన విధానమని రామప్రభు పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజల సమస్య కనిపిస్తే స్పందన కాదు.. పరిష్కారం కావాలి. మాట ఇచ్చిన చోట ఆగరు.. పని పూర్తయ్యే వరకు ముందుకు సాగుతారు అనే సందేశంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.





