శేరిలింగంపల్లి, ఆగస్టు 31 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)కి గాను నూతన లోగోను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఆవిష్కరించారని సీఎంసీ కమిషనర్ సృజన ఒక ప్రకటనలో తెలిపారు. సీఎంసీ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువయ్యామని, దీంతో ప్రతి కాలనీ, బస్తీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను సైతం అత్యంత ప్రాధాన్యత కేటాయించి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నట్లు వివరించారు. సీఎంసీకి కొత్త లోగో రావడం సంతోషకరమని అన్నారు.






