శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి-మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో అట్టేపల్లి రామప్రభు గురువారం ఉదయం కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలను నేరుగా కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. అనంతరం స్థానిక పాఠశాలను సందర్శించిన రామప్రభు.. హెడ్మాస్టర్, ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాలకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు యాకన్న గౌడ్, ఎం. మోహన్, రామయ్య, రాజు, ఏ. దేవేందర్, పి. దస్తప్ప, కడరి రాజు, సాయి గౌడ్, కె. శ్రీను, టీ. ప్రదీప్, ఆంజనేయులు గౌడ్, పాషా, పల్లపు శ్రీను, పవన్ చక్రవర్తి, జి. రఘు గౌడ్, జి. మల్లేష్, ఎం. దుర్గేష్, ఎస్. గణేష్, ఎస్. శివ, పి. వెంకటస్వామి, కె. వేణు, రాములు, బి. నవీన్, రామ్ రెడ్డి, పి. మల్లేష్, సంతు సింగ్, కె. తరుణ్, టీ. శ్రీకాంత్, పండు తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ సభ్యులు నాగిశెట్టి వినీత్, అడప అజయ్, అట్టేపల్లి సోమేశ్వర్తో పాటు మండల ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్, సహ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే తమ లక్ష్యమని అట్టేపల్లి రామప్రభు తెలిపారు.





