ఇండో–నేపాల్ ఏరోస్కేట్‌బాల్‌లో మియాపూర్ విద్యార్థి సత్తా.. రెండు స్వర్ణ పతకాలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నేపాల్‌లోని పోఖరాలో ఆగస్టు 17 నుంచి 23 వరకు నిర్వహించిన తొలి ఇండో–నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి పాటిబండ్ల నవనీత్ ప్రతిభ చాటాడు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో నవనీత్ రెండు స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటాడు. టీమ్ ఈవెంట్‌లో ఒక స్వర్ణ పతకంతోపాటు, వ్యక్తిగత విభాగంలోనూ మరో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. తన నైపుణ్యం, పట్టుదల, క్రమశిక్షణతో పోటీల్లో ఆకట్టుకున్నాడు.

నవనీత్ విజయంపై మియాపూర్ కెనరీ స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. అతని కృషి, క్రమశిక్షణ, పట్టుదలను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. నవనీత్ వ్యక్తిగత కోచ్ ఖాదర్ బాషా, స్కూల్ కోచ్ మహేష్ కూడా అతడిని అభినందించారు. క్రీడా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here