తారా నగర్‌లో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తారా నగర్ కూరగాయల మార్కెట్ వద్ద కొలువైన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బోనాల పండుగ మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. చెరుకు వ్యాపార ప్రొప్రైటర్ తెలుగు సుభాష్ ముదిరాజ్ ఆహ్వానం మేరకు బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. వ్యాపార, విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ప్రజలంతా ఐకమత్యంతో జీవించాలని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ డి. వీరేశం గౌడ్, బీసీ నాయకుడు కటికె రామచందర్, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు కె. నరసింహ యాదవ్, మహిపాల్ రెడ్డి, గోపాల్ ముదిరాజ్, పాండు ముదిరాజ్, రజక సంఘం శ్రీనివాస్, భీమిని శ్రీనివాస్, కటికె సంతు, ప్రజాప్రతినిధులు, సుభాష్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here