కాళేశ్వరంలో రాగం సుజాత యాదవ్ అస్థికల నిమజ్జనం

శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్‌పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు రాగం సుజాత యాదవ్ అస్థికలను కాళేశ్వరం పుణ్యక్షేత్రంలోని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కాళేశ్వరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రాగం సుజాత యాదవ్ అస్థికలను గోదావరి మాతకు అర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు రాగం సుజాత యాదవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాజానికి ఆమె అందించిన సేవలను స్మరించుకుంటూ కన్నీటి నివాళులర్పించారు. రాగం సుజాత యాదవ్ సేవలు, ఆశయాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here