శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని లేబర్ అడ్డా, కోణార్క్ వాచ్ షాప్ సమీపంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను నాయకులు స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






