శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బీఎల్ఓలకు మరోసారి శిక్షణ ఇవ్వాలని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు కోరారు. శేరిలింగంపల్లి ఇన్చార్జులు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సూచనల మేరకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఎన్నికల నమోదు అధికారి (ERO) నిర్వహించిన SIR సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలిసి మాధవరం రంగారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు స్వీకరించిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పెండింగ్లో ఉన్న ఫారాలు, కొత్తగా వచ్చిన దరఖాస్తులు, మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు, మ్యాపింగ్, అన్మ్యాప్డ్ ఓటర్ల వివరాలను ప్రతిరోజూ రాజకీయ పార్టీలకు అందించాలని అధికారులను కోరారు. అలాగే ఫారాలు నింపడం, వాటిని డిజిటల్ రూపంలో నమోదు చేయడంలో పలువురు బీఎల్ఓలకు పూర్తి అవగాహన లేదని పేర్కొంటూ, వారికి మరోసారి సమగ్ర శిక్షణ అందించి SIR కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రోజా, శ్రీనివాస్ గౌడ్, సతీష్ రావు, శ్రీకాంత్ ముదిరాజ్, కిరణ్ యాదవ్, గోపు శ్రీనివాస్, రామకృష్ణ, మల్లేష్, అల్లావుద్దీన్ పటేల్, సంతోష్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





