ఏ ఎన్నికల్లో అయినా గెలుపు ఖాయం: వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మరో ఊతం లభించింది. టీఆర్ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో చందానగర్, మియాపూర్ డివిజన్లకు చెందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి సుమారు 30 మంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీ విజయంతోపాటు కవితను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, తెలంగాణలో ఇకపై ఏ ఎన్నికలు జరిగినా విజయం టీఆర్ఎస్‌దేనని ఆయన పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో బిజిలి ప్రవీణ్, రాంభూపాల్ రెడ్డి, సూర్యప్రకాశరావు, నవీన్, శ్రీకాంత్, నాగేష్, రాజు, శ్రవణ్, బంటీతోపాటు మరికొందరు నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు విష్ణు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here