రాగం నాగేంద‌ర్ యాద‌వ్ జన్మదినం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): జనచైతన్య ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ గోపీనగర్ కాలనీలో ఉచిత దంత, సాధారణ వైద్య పరీక్షల శిబిరాలను మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్ సొంత నిధులతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్‌లో ఈ శిబిరాలు నిర్వహించారు. కృతిక డెంటల్ కేర్ ఆధ్వర్యంలో ఉచిత దంత పరీక్షలు, స్కంద హాస్పిటల్ ఆధ్వర్యంలో సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే తమ ప్రథమ ప్రాధాన్యత అని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.

అంబేద్కర్ భవన్ జనచైతన్య ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షుడు బజార్గట్ రమేష్ మాట్లాడుతూ రాగం నాగేందర్ యాదవ్ ముందస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరాల్లో రక్తపోటు (BP), షుగర్, ఈసీజీ, దంత పరీక్షలు సహా పలు ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కంద హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ మనోగ్న, డాక్టర్ రాజేశ్వరి దేవి, జనచైతన్య సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here