అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: తూళ్ళ వీరేందర్ గౌడ్

శేరిలింగంపల్లి, జూలై 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో 1 నుంచి 10 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలు, వెస్టర్న్ ప్లాజా అపార్ట్‌మెంట్స్‌లో ప్రత్యేక ఓటర్ల నమోదు, ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదే సమయంలో నకిలీ ఓట్లను గుర్తించి తొలగించడం ద్వారా పారదర్శకమైన, విశ్వసనీయమైన ఓటరు జాబితాలను రూపొందించాలని అన్నారు. అలాగే, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా ఉపయోగిస్తూ భారతీయ పౌరుల హక్కులను నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చట్టబద్ధమైన విధానంలో అక్రమ ఓట్లను తొలగించడం అవసరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మూల అనిల్ గౌడ్, శేరిలింగంపల్లి బీఎల్ఏ-1 మాణిక్ రావు, బీఎల్ఓ సూపర్వైజర్ సత్యనారాయణ రెడ్డి, బీఎల్ఓలు భాస్కర్, డి. నీరజ, పద్మ, ఉదయ్, సల్మా, బీజేపీ నాయకులు ఎన్. నరేందర్ ముదిరాజ్, శ్యామ్ లెట్ నందు, సురేందర్ ముదిరాజ్, అంబటి అశోక్, గోరెంకా శ్రీకాంత్, కంచ నవీన్, శ్యామలెట్ సంజీవ్, గానుగు దయాకర్ ముదిరాజ్, నీరుడు సురేష్ ముదిరాజ్, సతీష్ గౌడ్, నరసింహా రాజ్‌, సాయి ముదిరాజ్, చిత్తారి, దుర్గారామ్, కె. సంతోష్, నక్క శివకుమార్, రంగని విష్ణు, అనంతుల శివశంకర్ గౌడ్, రావు కోలా ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here