SIR సర్వేలో చర్చిల సందర్శన.. ఓటరు నమోదు, చైతన్యంపై రాగం నాగేందర్ యాదవ్ పిలుపు

శేరిలింగంప‌ల్లి, జూలై 26 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదివారం డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి, రాజీవ్ గృహకల్ప కాలనీల్లో ఉన్న పలు చర్చిలను సందర్శించి ఓటరు చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు మాజీ కార్పొరేటర్‌ను శాలువాతో సన్మానించి, ఆయన కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఒక్క ఓటు కూడా వృథా కాకుండా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వేను పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు. అనంతరం స్థానికులు తమ ప్రాంత సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాస్టర్లు డివిజన్‌లో కార్పొరేటర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఆయన సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు సభ్యులు శ్రీకళ, కనకలక్ష్మి, శ్రీకాంత్ దేవులపల్లి, పాస్టర్లు డానియల్, జ్యోతి ప్రకాష్, సుందర్ రావు, దేవానంద్, ప్రభుదాస్, నిర్మల్ కుమార్, జయరాజ్, ప్రేమ్ కుమార్, అమోస్, టోనీ, కుటుంబరావు, నరసింహరావు, మహిళలు భాగ్యలక్ష్మి, సౌజన్య, కళ్యాణి, సుధారాణి, చర్చి సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here