మియాపూర్‌లో SIR పనులను పరిశీలించిన ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూలై 26 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీఎన్ నగర్‌లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని శాసనసభ్యుడు ఆరెక‌పూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

ప్రజల్లో ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు ప్రక్రియలో భాగస్వాములు అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలను ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here