కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సామగ్రి పంపిణీ

శేరిలింగంప‌ల్లి, జూలై 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ఖాజాగూడలో గిఫ్ట్ ఎ స్మైల్ – ప్ర‌జెంట్ ఫ‌ర్ ఎ బెట‌ర్ ఫ్యూచ‌ర్ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో కొమిరిశెట్టి ఫౌండేషన్ తరఫున గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని 12 అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ చిన్నారులు, సిబ్బందికి అవసరమైన వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కొమిరిశెట్టి ఫౌండేషన్ సభ్యులు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here