SIRలో పేరు చెక్ చేసుకోండి, ఓటు హక్కు కోల్పోకండి.. జగదీశ్వర్ గౌడ్ పిలుపు..

శేరిలింగంప‌ల్లి, జూలై 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియ అని, ప్రతి అర్హుడైన పౌరుడు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అంజయ్యనగర్, సిద్ధిక్‌నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న Special Intensive Revision (SIR) కార్యక్రమాన్ని సోమవారం స్థానిక ప్రజలు, డివిజన్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా పునఃసమీక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. SIR ద్వారా అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయడం, తప్పులను సరిదిద్దడం, వివరాలను నవీకరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఓటరు జాబితాలో నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆయన విజ్ఞప్తి చేస్తూ, తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో వెంటనే పరిశీలించుకోవాలని సూచించారు. పేరు లేకపోతే నమోదు చేసుకోవాలని, వ్యక్తిగత వివరాల్లో మార్పులు ఉంటే సవరించుకోవాలని కోరారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యేలా చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు విక్రమ్ చారి, నందన్న, ఫాజిల్, బ్రహ్మానంద రెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణ గౌడ్, చెన్నయ్య సాగర్, వినోద్ యాదవ్, సురేష్ సాగర్, ప్రసాద్ రెడ్డి, నర్సింహులు, భరత్ రెడ్డి, యువ నాయకులు శివ గౌడ్, రాజ్ కుమార్, చిరంజీవి, రవి సాగర్, నర్సింహ, విజేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, లక్ష్మీ బాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here