శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర వడ్డెర కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్‌గా నియమితులైన గుంజ రేణుక నారాయణను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ, శేరిలింగంపల్లి వడ్డెర సంఘం అధ్యక్షుడు ముద్దంగుల తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గుంజ రేణుక నారాయణను రాష్ట్ర వడ్డెర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా నియమించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మంజల్కర్, శ్రామిక శక్తి అవార్డు గ్రహీత, టీపీసీసీ లేబర్ సెల్ వైస్ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరమల్ల వీరేందర్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఏ-బ్లాక్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉయ్యూరు శ్రీదేవి, టీపీసీసీ లేబర్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మాదిరెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ్మలి మాణిక్యం, బ్రహ్మానందం నాగరాజు, ఉయ్యూరు రామారావు తదితరులు పాల్గొన్నారు.





