అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు అందిస్తాం: మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి

శేరిలింగంప‌ల్లి, జూలై 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో పనిచేస్తున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని జిల్లా కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయు) రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకట్రాం రెడ్డి, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో జర్నలిస్టులుగా విధులు నిర్వహిస్తున్న అర్హులైన సీనియర్ రిపోర్టర్లందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అంతకుముందు టీయూడబ్ల్యూజే ప్రతినిధులు మాట్లాడుతూ నిబంధనల పేరుతో అర్హులైన జర్నలిస్టులకు ఇబ్బందులు కలగకుండా అందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని, ఈ విషయంలో అక్రిడిటేషన్ కమిటీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. వినతిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం జరుగుతుందని టీయూడబ్ల్యూజే నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ సభ్యుడు మల్కయ్య, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవిచంద్ర, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు రామారావు, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రవికిరణ్ రెడ్డి, డబ్ల్యూడబ్ల్యూజే ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here