ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి

శేరిలింగంప‌ల్లి, జూలై 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య సంస్థల్లో జూలై 7, 8 తేదీల్లో గంటపాటు నిరసన కార్యక్రమాలు, జూలై 9న కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. యూనియన్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, నాలుగేళ్ల క్రితం హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూఎస్‌ (HMFWS) ఆధ్వర్యంలో టెండర్లు పిలిచినప్పటికీ, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెల్లించాల్సిన వేతనాలు ఉద్యోగులకు అందడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం కార్మికులకు సుమారు రూ.11 వేల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో కనీసం రూ.26 వేల వేతనం ఇవ్వాలని కోరారు.

అలాగే టెండర్లలో రూ.26 వేల కనీస వేతనం అమలు చేసేలా నిబంధనలు చేర్చాలని, పీఎఫ్‌, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని, నాలుగు పండుగ సెలవులు, నాలుగు జాతీయ సెలవులు, 15 ఆర్జిత సెలవులు కల్పించాలని, బోనస్ చట్టం ప్రకారం ఏడాదికి ఒక నెల జీతానికి సమానమైన బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 7, 8 తేదీల్లో ప్రభుత్వ ఆస్పత్రుల ఎదుట గంటపాటు నిరసనలు, జూలై 9న కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. యూసుఫ్‌, ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న‌ కాంటాక్ట్ ఉద్యోగస్తులకు జీతం ఇవ్వట్లేదని ధర్నా నిర్వ‌హించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here