శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

శేరిలింగంప‌ల్లి, జూన్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శంషీగూడ డివిజన్ పరిధిలోని ఇందిరా హిల్స్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కాలనీ ప్రజలందరూ ఐక్యంగా, భక్తి శ్రద్ధలతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జోగిపేట్ భాస్కర్, ఇందిరా హిల్స్ కాలనీ అధ్యక్షుడు వెంకట్ నాయక్, కాలనీ వాసులు, శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here