రంగారెడ్డి అర్బన్ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా సీతారామరాజు

శేరిలింగంప‌ల్లి, జూన్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బొల్లంపల్లి సీతారామరాజు సోమవారం మసీదుబండలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ సూచన మేరకు తనను రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించినందుకు సీతారామరాజు సంతోషం వ్యక్తం చేశారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేయడంతోపాటు వారి తరఫున ప్రశ్నించే గొంతుగా నిలవాలని సూచించారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సీతారామరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, పద్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here