శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా పోలింగ్ బూత్‌లు 208, 209, 210, 211, 212 పరిధిలోని ఆల్విన్ కాలనీ, సప్తగిరి కాలనీల్లో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్ఓ అధికారి, బీజేపీ బీఎల్‌ఏ-1, బీఎల్‌ఏ-2 ప్రతినిధులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు స్థానికులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్‌లను అందజేశారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హ ఓటరు భాగస్వామి కావాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ బీఎల్‌ఏ-1 మాణిక్ రావు, హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్, స్థానిక బీఎల్‌ఏ-2 ప్రతినిధులు, బీజేపీ నాయకులు శ్రీధర్ రావు, కోటేశ్వరరావు, రవి గౌడ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.






