శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి వార్డు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఇందిర మహిళా శక్తి చీరాల పంపిణీ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాస్ రావు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్, ప్రాజెక్ట్ ఆఫీసర్ స్వాతి, సీఓలు పద్మ, శ్రీకాంత్ తదితర అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళా సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు చీరలను పంపిణీ చేశారు. మహిళల సంక్షేమం, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హ మహిళకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు.





