శేరిలింగంపల్లి, జూన్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం మియాపూర్, హైదర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో నిర్ణీత సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 33/11 కేవీ హెచ్ఎంటీ హిల్స్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ పొందుతున్న 11 కేవీ నందమూరి నగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉండనుంది. ఈ సమయంలో నందమూరి నగర్, బృందావన్ కాలనీ, గౌతమి నగర్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి.
అలాగే 33/11 కేవీ కేపీహెచ్‌బీ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే 11 కేవీ హైదర్‌నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. హైదర్‌నగర్ గ్రామం, నిజాంపేట్, హోలిస్టిక్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలు, రెయిన్బో హాస్పిటల్ రోడ్ ప్రాంతాలు ఈ అంతరాయంతో ప్రభావితమవుతాయని అధికారులు వెల్లడించారు. విద్యుత్ నిర్వహణ పనుల నేపథ్యంలో వినియోగదారులు సహకరించాలని కోరిన అధికారులు, తాత్కాలిక అసౌకర్యానికి విచారం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం ఏఈ/ఓపీ హైదర్‌నగర్ కార్యాలయాన్ని 8712472699 నంబర్లో సంప్రదించాలని సూచించారు.





