రాఘవేంద్ర నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మత్తులు వేగవంతం

శేరిలింగంపల్లి, జూన్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీ సీ-బ్లాక్ మెయిన్ రోడ్డులో కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్ల మరమ్మత్తు పనులను మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ గురువారం ప్రత్యక్షంగా సందర్శించి పర్యవేక్షించారు. డ్రైనేజీ లైన్లలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మత్తు పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనులు నిర్వహించడంతోపాటు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి పనిచేస్తానని, మౌలిక వసతుల మెరుగుదల కోసం అవసరమైన అంశాలపై అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అరుణ్, శాఖ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here