తెల్లాపూర్‌లో వైభవంగా శివపంచాయతన-నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం

శేరిలింగంపల్లి, జూన్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): పటాన్‌చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శివపంచాయతన సహిత నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరు భరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకకు శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మహోత్సవంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పలువురు సీనియర్ నాయకులతో కలిసి రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం శివపంచాయతన మూర్తులు, నవగ్రహ విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు.

అనంతరం రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సద్భావన, ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం, ప్రతిష్టా మహోత్సవం విజయవంతానికి కృషి చేసిన కొల్లూరు సత్తయ్యను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఛైర్మన్ కొల్లూరు సత్తయ్య, మాజీ కౌన్సిలర్ కొల్లూరు భరత్, పెరుగు ఐలేష్ యాదవ్, సీపీ రెడ్డి, మాజీ ఆయకట్టు ఛైర్మన్ నర్సింలు, కోఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ బుచ్చి రెడ్డి, కొల్లూరు శ్రీను, పద్మారావు, రవీంద్ర చారి, రాగం దేవేందర్ యాదవ్, శ్రీపాల్ రెడ్డి, మెట్టు కళ్యాణ్ యాదవ్, అఫ్జల్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here