విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, జూన్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడ డివిజన్ పరిధిలోని గంగారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నూతన స్కూల్ యూనిఫాంలను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్, స్థానిక నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునిక తరగతి గదుల నిర్మాణం, డిజిటల్ విద్యా వనరుల అందుబాటు వంటి పలు సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, బలమైన ప్రభుత్వ పాఠశాలలు – బంగారు తెలంగాణకు పునాది అనే భావనతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే సమాన అవకాశాలతో కూడిన సమాజ నిర్మాణానికి తొలి అడుగని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, శేఖర్ ముదిరాజ్, ప్రధానోపాధ్యాయుడు సుభాష్, యూసుఫ్, చిన్న, దేవరాజ్, ఇస్మాయిల్, యాదయ్య, అనిల్ కుమార్, శంకర్, అంజయ్య, భిక్షపతి, కోటప్ప, లక్ష్మణ్, సుధాకర్, నందూ, దొంతి రాజు, వల్లి, దొంతి శ్రీను, దేవానంద్, వీరేందర్, కంది పెంటయ్య, హనీఫ్, భీమమ్మ, స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here