శేరిలింగంపల్లి, జూన్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ నరేన్ గార్డెన్స్‌లో ఈ నెల 23న నిర్వహించనున్న SIR , సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి సన్నాహకంగా గురువారం గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గచ్చిబౌలి డివిజన్ బూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు మార్గదర్శకత్వంలో పార్టీ శ్రేణులతో జరగనున్న విస్తృత చర్చల నేపథ్యంలో ఈ సమావేశాన్ని శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా నిర్వహించారు.

ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడం, బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, SIR సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయడం వంటి అంశాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో రాగం జంగయ్య యాదవ్, హరిశంకర్ యాదవ్, దార్గుపల్లి నరేష్, అంజమ్మ, అశోక్ యాదవ్, యాదగిరి, రమేష్ గౌడ్, నారాయణ, శ్రీనివాస్, అజీమ్, లాయక్ ఖాన్, ఖాదర్ ఖాన్, తాహెర్, బాలమణి, సుగుణ, మాధవి, రాజేశ్వరి, ఉమ్మడి గచ్చిబౌలి డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.





