శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ కొంటు ముకుందం 36 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ ముకుందం–విజయ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్.కే. సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ ముకుందం దంపతులు ఆరోగ్యంగా, మనశ్శాంతితో, ఆనందంగా జీవించాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ముఖ్య సలహాదారు పట్లూరి కృష్ణమోహన్ విజయ–ముకుందం దంపతులు సుఖసంతోషాలతో మరెన్నో వివాహ వార్షికోత్సవ సంబరాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ చారితోపాటు తమ్మ చంద్రమౌళి, ఎం.వి.ఎస్ నాయక్, కీర్తికుమార్, అడ్వకేట్ సుదర్శన్, రాజశేఖర్ యాదవ్, రాజేందర్, మాధవరెడ్డి, శ్రీశైలం గౌడ్, వెంకట్, మురళీధర్, ఇస్మాయిల్, శ్రీకాంత్ రెడ్డి, సిద్ధార్థ ముదిరాజ్, శీను పటేల్, ఉడుముల రాజు తదితరులు పాల్గొని ముకుందం దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక యువజన అధ్యక్షుడు, మేదరి మహేంద్ర సంఘం యువజన అధ్యక్షుడు కొంటు సుమన్ ఆధ్వర్యంలో ప్రత్యేక విందు కార్యక్రమాలు నిర్వహించారు.





