కొండాపూర్‌లో ఆరోహి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, జూన్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ ప్రేమ్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోహి ఇంటర్నేషనల్ స్కూల్ ను శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ చిన్నారులకు అందుబాటులో అన్ని సౌకర్యాలతో కూడిన ఆధునిక భవనాన్ని నిర్మించి, తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం లేకుండా తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం విద్యారంగంలో పెరుగుతున్న వ్యయాల నేపథ్యంలో, సాధారణ కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా విద్యా సేవలు అందించడం అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు విలువలను కూడా బోధిస్తూ, తక్కువ ఫీజులతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని స్కూల్ యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్య ప్రతినిధులు డాక్టర్ దినేష్ భరత్, రేఖ, విజయలక్ష్మి, అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here