మియాపూర్‌లో ఘనంగా సమ్మక్క–సారలమ్మ పూజా మహోత్సవం

శేరిలింగంప‌ల్లి, జూన్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లో నిర్వహించిన శ్రీ సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల పూజా మహోత్సవ కార్యక్రమంలో కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ పాల్గొని అమ్మవార్ల ఆశీర్వాదాలు పొందారు. రాచమల్ల కృష్ణ పటేల్, ఆయ‌న కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి రమేష్, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.

కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్, రాచమల్ల ఓం ప్రకాష్ గౌడ్, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డితోపాటు రామచంద్ర, బాలింగ్ యాదగిరి గౌడ్, వీరేందర్ గౌడ్, కరుణాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, భాస్కర్ గౌడ్, తిరుపతి, తాండ్ర రాంచందర్ గౌడ్, మహేందర్ ముదిరాజ్, రవికుమార్ గౌడ్, వాసు, దినేష్ గౌడ్, గిరి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here